Hdfc credit card low limit problem
నేను దాదాపు రెండు సంవత్సరాల నాడు hdfc కోర్ క్రెడిట్ కార్డు ని పొందాను. చాలా తక్కువ క్రెడిట్ లిమిట్ ను నాకు ఇచ్చారు. నాకు అప్పటికే hdfc ఇచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా క్రెడిట్ లిమిట్ కలిగిన ప్రముఖ బ్యాంకు క్రెడిట్ కార్డులు నాకు ఉన్నాయి.hdfc ఇచ్చిన తక్కువ క్రెడిట్ లిమిట్ చూసి నేను అప్పుడు చాలా ఆశ్చర్యపోయాను🤔తర్వాత మరల hdfc bank మరో రెండు క్రెడిట్ కార్డులు నాకు ఇచ్చారు. అయినా సరే క్రెడిట్ లిమిట్ మాత్రం పెంచలేదు. నాకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి క్రెడిట్ లిమిట్ కన్నా 13 రెట్లు ఎక్కువగా క్రెడిట్ లిమిట్ కలిగిన క్రెడిట్ కార్డులు వేరే బ్యాంకులవి ఉన్నాయి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టిన హెచ్డిఎఫ్సి పట్టించుకోలేదు. నాకు చికాకు పుట్టి ఒక క్రెడిట్ కార్డును రద్దు చేశాను. అయినా సరే లిమిట్ పెంచలేదు ఇక నాకు వచ్చిన ఐడియా ఏమిటంటే చిల్లర ఖర్చులకు hdfc వాడుతున్నాను. టీ తాగినా పాల ప్యాకెట్ కొన్న టిఫిన్ చేసినా నాకు హెచ్డిఎఫ్సి కార్డులు గుర్తుకొస్తాయి వాటితో బిల్లు చెల్లింపు చేస్తాను🤣 పెద్ద వస్తువులు పెద్ద కొనుగోలుకు ఇతర భారీ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డులను వాడుతున్నాను. ఇక లిమిట్ పెంచమని హెచ్డిఎఫ్సిని అడగటం అనవసరం అని నిర్ణయించుకున్నాను😲😲 మనకు ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా 👍
I got hdfc core credit card almost two years ago. I was given a very low credit limit. I already have credit cards of leading banks with credit limit 10 times more than what hdfc gave me.I was very surprised to see the low credit limit given by hdfc 🤔Then again hdfc bank gave me two more credit cards. However, the credit limit has not been increased. I now have credit cards from other banks with credit limits 13 times higher than HDFC's credit limit. HDFC did not pay attention to the number of requests. I got annoyed and canceled a credit card. However, the limit was not increased and the idea that came to me is that I am using hdfc for retail expenses. Whether I drink tea or buy tiffin or buy a packet of milk, I remember HDFC cards and pay bills with them. I decided that it is unnecessary to ask HDFC to increase the limit.